Author Topic: కారులో పెళ్లి చూపులు - నాటకం  (Read 1153 times)

Administrator

  • Administrator
  • Sr. Member
  • *****
  • Posts: 324
    • View Profile
కారులో పెళ్లి చూపులు  - నాటకం
---------------------------------------
పాత్రలు - 1. సుబ్బు , 2. సుబ్బు అమ్మ,  3. సుబ్బు నాన్న, 4. సుభద్ర  5. డ్రైవర్ రాజు  6. రాజు అత్త కూతురు సీతా మాలచ్మి
---------------------------------------------------------------------------
ఘట్టం -1
స్టేజి వెనకాలగా ఇల్లు లాగా కనిపించే పెద్ద కర్టెన్ వుంటుంది.  ఇంట్లో సింపుల్ సోఫా సెట్, టీపాయ్, టేబుల్, కుర్చీ వుంటాయి.  గోడకి తేదీలు  పెద్ద గా చూపించే క్యాలెండర్, టైం ని పెద్ద గా చూపించే గడియారం వున్నాయి.

ఉపోద్ఘాతం - సుబ్బు వాళ్ళ అమ్మ చెపుతూ వుంటుంది
అమ్మ :  అబ్బాయి సుబ్బు కి కార్ లో పెళ్లి చూపులు చేసుకోవాలని చాలా సరదా. వాడి అమ్మగా నాకు ఆ ఐడియా థ్రిల్లింగ్ గా అనిపించింది.  కాని అలాంటి కార్ లు దొరకాలిగా.  మనకి లిమో లు అలవాటు లేదు.  ఇన్నొవలు కూడా పనికి రావు.  మనవన్నీ బడ్జెట్ కార్లు.  2 లక్షలకంటే వాటి ఖరీదు దాటితే మా పరిదిలోంచి అవి మటుమాయ మవుతాయి.

నాన్న: ఈ మధ్య కార్ రెంటల్ సర్వీసులు వచ్చాయి కదా, మరి ఏ స్చొర్పిఒ నో రెంట్ కి తీసుకుంటే పోలేదా?

అమ్మ : ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని ఇది ఇంకా పెళ్లి చూపులే కదండీ, ఎన్ని చూడాల్సి వస్తుందో ఏమో కొద్దిగా చూసి ఖర్చు పెడదా మండి.

కాస్సేపాగి మళ్ళీ

అమ్మ : చూపులకి సంబంధాలు రెడీ గా వున్నా సరైన కారు దొరకక పోవటం మూలంగా వాటిని వాయిదా వేసుకోవాల్సి వస్తోంది.  నాకు దిక్కులు తోచ టల్లా.  మా వాడు గత నెల రోజులుగా ఇంటికి ఆలస్యం గా రావటం మొదలు పెట్టాడు.  ఇదేమిట్రా అంటే నంగి సాకులు చెప్ప సాగాడు.  నాలో మధన పెరిగి పోయింది. మా వారి సలహా పాటించక పోవటం తో ఆయనతో కూడా ఏమి చెప్పుకోలేక పోతున్నాను.

ఇంతలో ఆ శుభ దినం రానే వచ్చింది.  ఈ రోజు నాకు అ ఘడియలని తలుచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే - 'పుత్రోత్సాహము పుత్రుడు .....' పద్యం గుర్తుకి వస్తుంది.

ఆ రోజు - మా వాడు సాయంత్రం 6 గంటలకి ఒక కార్ ని ఇంటి ముందు పార్క్ చేసి పరుగెత్తుకుంటూ లోపలి వచ్చాడు.

సుబ్బు : అమ్మా, రెండు కప్పులు కాఫీ చేసి ఫ్లాస్క్ లో అర్జెంటు గా పొయ్యి.  నేను మసాలా వేరు శనగ పప్పు తెచ్చాను. రెండు కప్పులు సాసర్ల తో సహా ఒక మంచి ట్రే లో  పెట్టి రెడీ గా ఉంచు. నేను ఫ్రెష్ అయి వస్తాను.

అమ్మ : అని బాత్రూం లో దూరాడు.  నేను ఏమి ప్రమోషన్ వచ్చిందో అనుకుంటూ అన్ని చక చక రెడీ చేసి  నన్ను నేను నీట్ గా చేసుకుని కూర్చున్నాను.  (లోపలి వెళ్లి చీర మార్చుకుని వస్తుంది.) మా సుబ్బు చక్కటి కసుఅల్ డ్రెస్ లో వచ్చి అ ట్రే పుచ్చుకుని నన్ను రెండో చేత్తో పట్టుకుని అ కార్ దగ్గరికి తీసుకు వెళ్ళాడు.

వెనకాల డోర్ తీసి
సుబ్బు : మొదట నువ్వు  కూర్చో అమ్మ .  అన్నాడు.

అ ట్రే ని నా చేతికి ఇచ్చి తను డ్రైవర్ పక్క వున్నా సీట్ ని, దాని బ్యాక్ రెస్ట్ ని కార్ ముందు భాగం వైపు తోసాడు.  తను వెళ్లి దాన్లో కూర్చున్నాడు.  నేను ఇవన్నీ కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ సంతోషం పట్టలేక
అమ్మ : 'ఏవండీ' అని ఒక గావు కేక పెట్టాను. 

ఆయన ఇంకా ఇంటికి రాలేదు.  ఈ లోపల సుబ్బు ఒక చిన్న స్టూల్ ని దాని కాళ్ళు ఓపెన్ చేసి మా యిద్దరి మధ్య పెట్టాడు.  దాని మీద నా చేతిలోంచి ట్రే తీసుకుని పెట్టి, కాఫీ రెండు కప్పుల్లో పోసి ఒకటి నా చేతికి ఇచ్చాడు.  నేను ఉత్సాహం ఆపుకోలేక వాడిని లేచి కావులిన్చుకున్నాను.  ముద్దు పెట్టుకున్నాను.  అమ్మ : 'గత నెల రోజులుగా నువ్వు చేసింది ఇదిరా ?!?!

అంటూ ఉక్కిరి బిక్కిరి అయ్యాను.  వొంటి మీద ఏదో వేడిగా తగలటం తో ఏమిటా అని చూస్తే కాఫీ అంతా నా మీద వొలికి వుంది.  అయినా దాని మాటే మర్చి పోయి వేరు శనగ పప్పు తింటూ సుబ్బు పెళ్లి చూపులు ఎలా జరగాలా అని ప్లాన్ చేయటం మొదలు పెట్టాం. 

సుబ్బు : అమ్మ , నువ్వు అమ్మాయి వాళ్ళ అమ్మ, నాన్నలతో ముందే చెప్పు నేను తనని కార్ డ్రైవ్ కి తీసుకు వెళతానని.  దానికి ఒప్పుకుంటేనే నేను చూపులకి రెడీ. 

అమ్మ ; వాళ్ళు ఒప్పుకోక పోతే ఏమి తెద్దాం ?

సుబ్బు : వాళ్ళని ఒప్పించే బాధ్యత నీది, నాన్నదీను.  ఆ మాత్రం చెయ్యలేరా మీ అబ్బాయి కోసం
అని ఎదురు ప్రశ్న వేసాడు. 

అమ్మ : అయితే నేను వాళ్లకి నీ కార్ లో వున్నా ఈ కొత్త విషయం గురించి కూడా చెప్పనా ?

సుబ్బు : అమ్మ, ఆ మాత్రం త్రిల్ నాకు మిగల్చవే.  ఇప్పుడు నీలాగానే ఆ అమ్మాయి కూడా స్పందిన్చిందంటే నాకు భరోసా వస్తుంది;  అని తన రహస్యం బయట పెట్టేసాడు. 


నా ఆనందం చూసి మా వాడు చాలా సిగ్గు పడ్డాడు, కాని వాడికి ఒక విషయం మాత్రం ఖచ్చితం గా తెలిసింది - ఆడ వాళ్లకి ఇట్లాంటి సుర్ప్రిజేస్ ఇస్తే ఎట్లాంటి ఫలితాలు వస్తాయో అన్న విషయం.  పెళ్లి చూపులకి ఇంకా ఎటువంటి మార్పులు చెయ్యవచ్చా అన్న ఆలోచనలో పడ్డాడు. 

ఆ రోజునే మేము వాడికి మొదటి చూపుల తేది ని ఖరారు చేసాము.